BHRC 2024-05-19 11:36:31
నిన్నటి రోజు 09-08-2023వ తారీఖునా గుంటూరు జిల్లా గుంటూరు లో సమస్య పరిష్కార దశ
విషయం:- గుంటూరు జిల్లా వాసవియులైన జి.రూతమ్మ గారు గడిచిన కొన్ని నెలల క్రిందట డాక్టర్:వై.కిరణ్ కుమార్ గారు(జి.జి.హెచ్) సూపర్డెంట్ గారి ద్వారా ఆపరేషన్ జరిగింది. కానీ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల సమస్య చాలా ఇబ్బందికరంగా మారింది. దాని వల్ల కుటుంబ సభ్యులు వెళ్లి ఆ డాక్టర్ గారిని సమస్యను పరిష్కరించమని వారు కోరారు. కానీ ఆ సమస్య ను పరిష్కరించినందువలన బాధితులైన వారు గుంటూరు జిల్లా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కార్యవర్గానికి సమస్యపై వినతిపత్రమును ఇవ్వగా వారు ఆ డాక్టర్ గారిని కలుసుకొని లెటర్ ను ఇచ్చి మాట్లాడటం జరిగింది. కానీ ఆ డాక్టర్ గారు సమస్యను పరిష్కరం పూర్తిగా చేయనందువలన నిన్నటి రోజున నేషనల్ వైస్ ఛైర్మన్ & నేషనల్ ప్రెసిడెంట్ రెవ,డా:పుల్లెల్ల.నాగేశ్వరరావు గారు, మరియు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ రెవ:ఇమ్మానుయేలు అల్లు గారు, మరియు
ఏపీ స్టేట్ సెక్రటరీ రెవ:పెనుగుర్తి.జాన్ గారు అలాగుననే గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు వెళ్లి మరొక సారీ పత్రాన్ని ఇచ్చి సమస్యను గురించి మాట్లాడటం జరిగింది. అదే సమయంలో నేషనల్ చైర్మన్ డా:పూర్ణచంద్ర సాహూ గారు కూడా ఫోన్ ద్వారా ఆ డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. దీంతో ఆ సూపర్డెంట్ గారు మరో రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించి బాధితులకు సమన్యాయం జరిగిస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది!
జైహింద్ జై భారత్
నేషనల్ వైస్ ఛైర్మన్ & నేషనల్ ప్రెసిడెంట్ రెవ,డా:పుల్లెల్ల. నాగేశ్వరరావు గారు
ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇమ్మానుయేలు అల్లు